ఏపీసీఎం వైఎస్ జగన్ ఇతరరాష్ట్రాలలో కూడా వర్తించేట్టుగా ఆరోగ్యశ్రీ పధకాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరుకు ఏపీకి మాత్రమే ఈ సేవలని పరిమితం కాగా, ఆంధ్ర ప్రజలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో కూడా ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఆరోగ్యశ్రీ పథకాన్నీ అక్కడ కూడా ప్రారంభించారు. నేడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పథకాల్ని ప్రారంభించారు. దీంతో నేటి నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్రభుత్వం గుర్తించిన 130 ఆస్పత్రుల్లో ఈ సూపర్ స్పెషాలిటీ సేవలు అమల్లోకి రానున్నాయి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు 17 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 716 రకాల వైద్య ప్రక్రియలు అమల్లోకి వచ్చాయి.
దీని ద్వారా ఏపీ ప్రజలు ఈ మూడు రాష్ట్రాలలో ఎక్కడ ఉన్నాకూడా ఆరోగ్యశ్రీ సేవలు పొందొచ్చు. చెన్నైలోని ఎంఐఓటీ, బెంగుళూరులోని ఫోర్టిస్, హైదరాబాద్‌లోని మెడ్‌కవర్ ఆస్పత్రి డాక్టర్లు, అక్కడి ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో ముఖాయమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. చికిత్సల విధానంపై ఆ డాక్టర్లను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. ఏపీ రాష్ట్రానికి చెందిన వారిని బాగా చూసుకోవాలని, ఎంతో విశ్వాసం, నమ్మకంతో చికిత్సకోసం అక్కడికి వచ్చారని వారు ఆరోగ్యవంతులు అయ్యేంత వరుకు వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని డాకర్టర్లను కోరారు. దీంతో ఏపీ ప్రజలు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హీరోయిన్ బోల్డ్ కామెంట్స్ … వర్జినిటీ నిధి కాదు…!?