telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“డిస్కోరాజా” మా వ్యూ

Disco

బ్యాన‌ర్‌ : ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
న‌టీన‌టులు : ర‌వితేజ‌, న‌భా నటేష్, పాయ‌ల్ రాజ్‌పుత్‌, తాన్యా హోప్‌, బాబీ సింహ‌, సునీల్‌, వెన్నెల‌కిషోర్‌ త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: వి.ఐ.ఆనంద్‌
సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
నిర్మాత‌: రామ్ తాళ్లూరి

మాస్ మహారాజా రవితేజకు ఇటీవల కాలంలో సరైన హిట్ లేదు. గత కొన్ని సంవత్సరాలుగా రవితేజ ట్రాక్ చూసుకుంటే హిట్ల కన్నా ఫ్లాపులే ఎక్కువగా ఉన్నాయి. ‘బలుపు’, ‘పవర్’, ‘బెంగాల్ టైగర్’, ‘రాజా ది గ్రేట్’ వంటి వరుస హిట్లు రవితేజ స్టామినాను చెప్పాయి. ‘రాజా ది గ్రేట్’ సినిమాతో రవితేజ మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించారు. కానీ, ‘టచ్ చేసి చూడు’, ‘నేల టిక్కెట్’, ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రాలు ఆయన్ని ఒక్కసారిగా వెనక్కి నెట్టేశాయి. ఈ క్రమంలో రవితేజ ఎంపిక చేసుకున్న విభిన్నమైన చిత్రం ‘డిస్కోరాజా’. సైన్స్ ఫిక్షన్‌గా మంచి కమర్షియల్ కంటెంట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ‘డిస్కోరాజా’కు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. మరి ఈ చిత్రంతోనైనా రవితేజ “మాస్ మహారాజా ఈజ్ బ్యాక్” అనిపించుకున్నాడా ? అసలు కథేంటో తెలుసుకుందాం.

కథ :
వాసు (రవితేజ) ఓ అనాథ. కొంతమంది అనాధలతో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటాడు. ఆ ఇల్లును కొనుక్కోవాలని వారంతా కలిసి 25 లక్షల రూపాయలను దాచుకుంటారు. ఆ డబ్బును దొంగతనం పాలవుతుంది. డబ్బును దొంగిలించిన వ్యక్తిని వెతుక్కుంటూ వాసు గోవా చేరుకుంటాడు. ఆ తరువాత లడక్ లో మంచులో కూరుకుపోయి వాసు చనిపోతాడు. ఆ తరువాత వాసు ఎలా బ్రతుకుతాడు ? అసలు ఈ డిస్కోరాజా ఎవరు ? వాసుపై శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం ఏంటి ?డిస్కోరాజాకి, సేతుకి ఉన్న వైర‌మేంటి? చివరకు వాసు ఏమయ్యాడు ? అనే ఆసక్తికర విష‌యాలు తెలియాలంటే సినిమాను వెండి తెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
తండ్రి, కొడుకు పాత్రల్లో రవితేజ త‌న‌దైన స్టైల్లో నటించాడు. లుక్ ప‌రంగా యంగ్‌గా క‌నిపించి ఆక‌ట్టుకున్నాడు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాత్ర‌లో ర‌వితేజ లుక్ అప్ప‌టి రెట్రో లుక్‌ ఆకట్టుకుంటుంది. పెద్ద‌గా స్కోప్ లేని పాత్ర‌లో న‌భా న‌టేశ్ న‌టించింది. ఇస్మార్ట్ శంక‌ర్‌తో వచ్చిన క్రేజ్ ఈ సినిమాతో పోయింది. పాయ‌ల్ రాజ్‌పుత్ పాత్రను ఓపాట మ‌రికొన్ని సీన్స్‌తో త‌న పాత్ర‌ను ప‌రిమితం చేశారు. ఇక తాన్యా హోప్ పాత్ర గురించి ఎంత త‌క్కువ‌గా చెప్పుకుంటే అంత బెట‌ర్‌. బాబీ సింహ విలనిజం క్లైమాక్స్ లో తేలిపోయింది. ఇక రాంకీ, స‌త్య‌, సునీల్‌, ర‌ఘుబాబు, భ‌ర‌త్‌, వెన్నెల‌కిషోర్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు విఐ ఆనంద్ సైన్స్ ఫిక్షన్ పేరుతో రొటీన్ కమర్షియల్ మూవీని తెరకెక్కించారు. సినిమా ప్రారంభంలో ల‌డ‌క్‌లో వ‌చ్చే సీన్స్‌, ఇంట‌ర్వెల్ బ్యాంగ్, డాక్ట‌ర్స్ ద‌గ్గ‌ర ఉండేది డిస్కోరాజా అనే ట్విస్ట్, ఇక క్లైమాక్స్ మెయిన్ విల‌న్ ట్విస్ట్ బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్షలా మారతాయి. త‌మ‌న్ సంగీతం “నువ్వు నాతో ఏమ‌న్నావో…” పాట మాత్ర‌మే విన‌డానికి బావుంది. పాట‌లు తెరపై గొప్ప‌గా ఏమి లేవు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కెమెరా ప‌నిత‌నం సినిమా ప్రారంభంలో వ‌చ్చే ల‌డ‌క్ సన్నివేశాల్లో అద్భుతంగా ఉంటుంది. మిగ‌తా వాటిలో ఫర్వాలేదు అన్పిస్తుంది. సెకండాఫ్ లో ఎడిటింగ్ పై మరింత శ్రద్ధ పెట్టాల్సింది.

రేటింగ్ : 2.5/5

Related posts