telugu navyamedia
సినిమా వార్తలు

శ్రీరెడ్డిని చంపడానికి కుట్ర… సాక్ష్యాలు బయటపెట్టిన బ్యూటీ

Srireddy

నటి శ్రీరెడ్డిపై ఇటీవల చెన్నైలో దాడి జరిగిన విషయం అందరికి తెలిసిందే. సుబ్రహ్మణ్యం అనే ఫైనాన్షియర్ తన ఇంటికి వచ్చి దాడి చేసి, తనను చంపడానికి ప్రయత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది శ్రీరెడ్డి. తాజాగా తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్, ఆడియో రికార్డింగ్ ను విడుదల చేసింది. ఈ సీసీటీవీ ఫుటేజ్ లో అర్ధరాత్రి సమయంలో సుబ్రహ్మణ్యం కొంతమంది మనుషులను వెంటబెట్టుకొని వచ్చినట్టు కన్పిస్తోంది. ఆడియో, వీడియోలతో పాటు ఈ వివాదానికి గల కారణమేంటో వివరించింది శ్రీరెడ్డి.

గతంలో సుబ్రహ్మణ్యం అనే ఈ ఫైనాన్షియర్ హైదరాబాద్ లో పెద్ద స్కాం చేశాడని, మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసు నమోదైందని, నాలుగు నెలలు జైలు శిక్షను అనుభవించిన సుబ్రహ్మణ్యం 15 రోజుల కిందటే విడుదలయ్యాడని తెలిపింది.

అయితే తాను తమిళంలో చేస్తున్న “రెడ్డీ డైరీ” చిత్రానికి ఫైనాన్స్ ఇచ్చింది అతనేనని, ఆ సినిమాలో నటిస్తున్న కారణంగా పోలీసులు ఆమెను కూడా విచారించారని చెప్పుకొచ్చింది. దీంతో తనను పోలీసులకు పట్టించింది శ్రీరెడ్డి అని అనుకుంటున్న సుబ్రహ్మణ్యం కక్ష పెంచుకుని చంపడానికి వచ్చాడని, కొంతమంది కేసు వెనక్కి తీసుకోమని బెదిరిస్తున్నారని, కానీ తాను భయపడే రకం కాదని పేర్కొంది శ్రీరెడ్డి.

Related posts