శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ సినిమాతో పరిచయమైన సాయి పల్లవి తక్కువ కాలంలో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా సాయిపల్లవి టాలీవుడ్ నిర్మాత గుండెల్లో ఒక పెద్ద బాంబే పేల్చింది. తాజాగా ఒప్పుకోబోయే సినిమాలకి సాయి పల్లవి తన రెమ్యునరేషన్ భారీగా పెంచేసినట్లు పలు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం మేరకు సాయి పల్లవి ఒక సినిమా 1.40 కోట్లను డిమాండ్ చేస్తుందట. ఆమె ఇంతలా రెమ్యునరేషన్ చేయడంతో నిర్మాతలు కంగుతింటున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి డిమాండ్ చేస్తోన్న పారితోషికం సమంత, అనుష్కా, కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్‌తో సమానం. ఎంతలా క్రేజ్ ఉంటే మాత్రం ఇంతలా రెమ్యునరేషన్ పెంచేస్తుందా? అంటూ టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. కాగా ప్రస్తుతం సాయి పల్లవి, రానాతో ‘విరాట పర్వం’, అలాగే నాగచైతన్య సరసన ‘లవ్ స్టోరీ’లోనూ నటిస్తోంది.
“ప్రధాని నరేంద్ర మోడీ మీదనే పోరాటం చేసిన ప్రకాష్ రాజ్ “మా”.. లో .. ఇలా ..?” -శివాజీ