telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ యాంకర్ వారసుడి ఎంట్రీ

suma

టాలీవుడ్ లో మరో వారసుడు ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తుంది. గతంలో హీరోగా నటించి ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాలను హీరోగా వెండితెరకు పరిచయం చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక రాజీవ్ కనకాల సతీమణి సుమ తెలుగు టాప్ యాంకర్ అన్న విషయం తెలిసిందే. రోషన్ గతంలో శ్రీకాంత్ తనయుడు నటించిన ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రంలో నటించాడు. ఇప్పుడు రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రోషన్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారని తెలుస్తోంది. కొత్త దర్శకుడు విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. మరి ఈ యంగ్ హీరో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న వివాదం నెపోటిజం. స్టార్స్ బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణం తరువాత నెపోటిజం పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. టాలీవుడ్ లోకూడా వారసులు వస్తూనే ఉన్నారు. మెగాఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజను కు పైగా హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఇక నందమూరి, అక్కినేని, మంచు, ఘట్టమనేని, దగ్గుబాటి ఫ్యామిలీల్లో నుంచి చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు.

Related posts