telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేను గ్రీన్‌కు, ఛాలెంజ్‌లకు చాలా దూరం… రాజమౌళికి వర్మ షాకింగ్ రిప్లై

RGV

“గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా ఈ రోజు ఇండియన్ సినీ జక్కన్న తన RRR టీంతో కలిసి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో పాల్గొన్నారు. మెగాపవర్ స్టార్ రాంచరణ్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన రాజమౌళి లింగంపల్లిలోని తన కార్యాలయంలో 25 మంది యూనిట్ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం జక్కన్న మాట్లాడుతూ.. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి ఆలోచన… ప్రకృతిని పరిరక్షించడానికి తన వంతు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి అభినందనలు… ప్రతీ ఒక్కరు తమ బాధ్యతగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలి, మొక్కలు నాటాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం రాజమౌళి వ్యక్తిగతంగా సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ, పూరీ జగన్నాథ్, వివి వినాయక్ లతో పాటు, తన RRR చిత్ర యూనిట్ తరఫున మెగాస్టార్ “ఆచార్య”, యంగ్ రెబల్ స్టార్ “రాధేశ్యాం”, అల్లు అర్జున్ “పుష్ప” చిత్రబృందాలను నామినేట్ చేశారు. అయితే వర్మ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించనని ట్వీట్ చేశారు. “రాజమౌళి సర్.. నేను గ్రీన్‌కు, ఛాలెంజ్‌లకు చాలా దూరం. మట్టిని ముట్టుకోవడం అంటే నాకు అసహ్యం. మొక్కలకు నాలాంటి స్వార్థపరుడి అవసరం లేదు. మీకు, మీ మొక్కలకు ఆల్ ది బెస్ట్” అని వర్మ పేర్కొన్నారు.

Related posts