telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో ఈ నెల 17న కొత్త అసెంబ్లీ.. ప్రొటెం స్పీకర్‌ గా ముంతాజ్‌!

Telangana Assembly Sessions start

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులతో కొత్త శాసనసభ కొలువుదీరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 17వ తేదీ గురువారం రెండో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన 38 రోజులకు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.నాలుగు రోజులపాటు అంటే 20వ తేదీ వరకూ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ప్రజలు గొప్ప మెజారిటీతో తమను గెలిపించారని, ఆ స్ఫూర్తితో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏకాదశినాడు శాసనసభ కార్యకలాపాలు ఆరంభించాలని నిర్ణయించినట్లు  సీఎం కేసీఆర్‌ తెలిపారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

చార్మినార్‌ మజ్లిస్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ ఖాన్‌ ప్రొటెం స్పీకర్‌ హోదాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. దీనికి ముందే.. ఈ నెల 16న సాయంత్రం ఐదు గంటలకు ముంతాజ్‌ ఖాన్‌ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేస్తారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో ముంతాజ్‌ ఖాన్‌తో ప్రమాణం చేయిస్తారు. మరుసటి రోజు శాసనసభ తొలి సమావేశం జరగనుంది. జనవరి 17న ఉదయం 11.30 గంటలకు సభాకార్యక్రమాలు ప్రారంభమవుతాయి. దాదాపు రెండుగంటలపాటు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగనుంది. అదే రోజున స్పీకర్‌ ఎన్నిక నిర్వహణ షెడ్యూల్‌ను ప్రకటన.. నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది.

Related posts