యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో జయమ్మ పంచాయితీ పేరుతో ఓ మూవీ తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల అయ్యింది.
ఈ సినిమా ట్రైలర్‌ను పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్రైలర్లో జయమ్మగా సుమ లుక్స్, నటన, సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
రా బావా.. మా ఊర్లో పంచాయితీ సూద్దువ్ గానీ.. ఏ ఊర్లో జరగని ఎరైటీ గొడవ ఒకటి జరుగుతోంది’ అని చెప్పడంతో ఈ ప్రచార చిత్రం ప్రారంభమైంది. ఏటి జయమ్మ నువ్వు పంచాయితీ రావడం ఏటి..నేనెందుకు వస్తాను..మీరే చేసినారుగా.. అంటుంది జయమ్మ.
ఇద్దరు ఆడ పిల్లల తల్లి అయిన జయమ్మ.. అనారోగ్యంతో ఉన్న తన భర్తను కాపాడుకునేందుకు.. గ్రామ పంచాయతీ ముందు తన సమస్యను లేవనెత్తుతుంది. అయితే అప్పటికే ఏదో సమస్యను ఎదుర్కొంటున్న గ్రామం.. ఆమె సమస్యను పక్కనపెడుంది. ఈ క్రమంలోనే తన సమస్యను పరిష్కరించడానికి బలమైన నిర్ణయం తీసుకున్న జయమ్మ.. ఆ గ్రామంపై కూడా పోరాడేందుకు సిద్ధమవుతోంది.
శ్రీకాకుళం యాసలో నటులు మాటలు వింటే ..ఆ ప్రాంతపు నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్లు అర్ధమైంది . పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరక్కెకిన ఈసినిమాలో సుమ జయమ్మ పాత్రలో అదరగొట్టినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఆమె డైలాగ్ డెలీవరీ ఆకట్టుకుంటుంది.
అంతేకాకుండా సుమ ట్రైలర్ చివర్లో మాత్రం బూతు డైలాగ్ చెప్పడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా చాలా కాలం తర్వాత సుమ ప్రధాన పాత్రలో నటించిన సినిమా కావడంపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రాన్ని బలగ ప్రకాష్ నిర్మించారు. మే6న ఈ సినిమా రిలీజ్ కానుంది.
వాళ్ళను రెచ్చగొడుతున్నారు… “సైరా” వివాదంపై చిరు సంచలన వ్యాఖ్యలు