telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

పెరిగిన బంగారం.. స్థిరంగా వెండి ధరలు

gold

కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు ఢిల్లీలో, హైదరాబాద్ లో మాత్రం బంగారం ధరలు కాస్త పెరిగాయి. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరగడంతో రూ. 50,410కి చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరగడంతో రూ. 46,210కి చేరుకుంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరగడంతో రూ. 48,070 కు చేరుకుంది… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరగడంతో రూ. 44,060 పలుకుతోంది. అటు వెండి ధరలు మాత్రం ఎగిసిపడుతున్నాయి. బంగారం ధరలు పెరగగా వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ. 73,400 గా నమోదైంది.

Related posts