telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైతులకు పంటనష్ట పరిహారం చెల్లించాలి: రాఘవులు

bv raghavulu cpm

భారీ వర్షాలకు రైతుల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. రైతులకు పంటనష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ మండలం చెల్పూరులో వర్షానికి నష్టపోయిన వరి పొలాలను రాఘవులు పరిశీలించారు.

వర్షాలకు దెబ్బతిన్న పంటలను ప్రభుత్వం తగ్గించి చెబుతోందని ఆయన ఆరోపించారు. ఇన్సూరెన్స్‌తో నిమిత్తం లేకుండా రైతులకు పూర్తిస్థాయిలో నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఇళ్ళు కూలిన వారికి ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల కోసం నిరుపేదలు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

Related posts