telugu navyamedia
క్రీడలు వార్తలు

రొనాల్డో పై జయవర్దనే పంచ్…

పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో చేసినపనికి ప్రముఖ బేవరేజస్ సంస్థ కోకాకోలా ఏకంగా రూ.29వేల కోట్లు నష్టపోయింది. యూఈఎఫ్‌ఏ యూరోకప్‌ 2020లో భాగంగా క్రిస్టియానో రొనాల్డో జట్టు కెప్టెన్‌ హోదాలో కోచ్‌ ఫెర్నాండో సాంటోస్‌తో కలిసి గత మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. అయితే తాను కుర్చీలో కూర్చునేటప్పుడు టేబుల్‌పై రెండు కోకకోలా బాటిల్స్‌ కనిపించాయి. వెంటనే వాటిని చేతిలోకి తీసుకొని పక్కన పెట్టేసి.. ‘ఇలాంటివి వద్దు. మంచినీరు మాత్రమే తాగండి’ అంటూ వాటర్‌ బాటిల్‌ను తన చేతిలో తీసుకొని చెప్పాడు. . రొనాల్డో దెబ్బకి ​కోకాకోలా స్టాక్‌ ధరలు 1.6 శాతానికి పడిపోయి.. 238 బిలియన్ల అమెరికన్‌ డాలర్లకు చేరింది. అంతకు ముందు కోకాకోలా విలువ 248 బిలియన్ల డాలర్లు ఉండింది. దీంతో 4 బిలియన్ల డాలర్లు (మన కరెన్సీలో 29 వేల కోట్ల దాకా) నష్టం వాటిల్లినట్లయ్యింది. ఇక రొనాల్డో చేసిన పనికి సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలోనే ఓ శ్రీలంక అభిమాని రొనాల్లోను ప్రశంసిస్తూ.. తమ దేశ మాజీ క్రికెటర్లు అయిన కుమార సంగక్కర, మహేలా జయవర్ధనేలను తప్పుబట్టాడు. ఇక ఈ విమర్శలపై పరోక్షంగా స్పందించిన జయవర్దనే.. క్రిస్టియానో రొనాల్డో ఏమైనా సుద్దపూసనా? గతంలో అతను అదే కోకాకోలా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడని గుర్తు చేశాడు. కాకపోతే నేరుగా కాకుండా తనదైన శైలిలో సెటైర్లు పేల్చాడు. ‘మరొకసారి అంబాసిడర్‌గా ఉంటే పారా చూట్ లేకుండా చేయాలి’అని ట్వీట్ చేశాడు. దీనికి రొనాల్డో కోకాకోలా అడ్వర్టైజ్‌మెంట్ ఫొటోలు జత చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. 2006లో రొనాల్డో కోకాకోలా బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు.

Related posts