telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

నగరాలలో ప్రమాదకర … ప్రదేశాలు ఇవే.. తస్మాత్ జాగర్త!

New couples attack SR Nagar

టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. అదే అంశం ఉపయోగించుకొని అధికారులు నేరస్తులను పట్టుకోగలుగుతున్నారు తప్ప, నేరాలు జరగకుండా ముందస్తు జాగర్తలు తీసుకోలేకపోతున్నారు. సాధారణంగా ఈ నేరాలు జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశాలలో, సమయాలలో జరుగుతున్నాయి. ఈ స్థలాలలో మృగాళ్లకు కంటపడింది ఆడవాళ్లయితే చాలు.. వయసుతో నిమిత్తం లేకుండా.. పసికూనల నుంచి వృద్ధుల దాకా మృగాళ్లు వెంటబడి వేటాడుతున్నారు. హైదరాబాద్‌ మహానగరంలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఫ్లైఓవర్స్‌ కింద, మెట్రో మలుపులు, రైల్వేస్టేషన్‌ పరిసరాలు, నివాస సముదాయాలకు కూత వేటు దూరాలు, ఎక్కడైతేనేం మనుషుల అలికిడి తగ్గితే చాలు అరాచక శక్తులు నిద్ర లేస్తున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట నేరాలు, దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా.. ఈ క్రింది ప్రాంతాలు క్రైమ్స్‌కి అడ్డాగా మారాయి. అవేంటో మీరు తెలుసుకోండి. ఇదంతా సాధారణ జనజీవనానికి దూరంగా ఉండే అడవుల్లో కాదు.. కొండలు, గుట్టల్లో కాదు.. గొప్పగా చెప్పుకుంటున్న నగరంలో మాటువేసి కాటు వేస్తున్నాయి.

ఇటువంటి ప్రదేశాలలో ప్రతి రోజు నేరాలు, దారుణాలు చోటుచేసుకుంటున్నప్పటికీ భద్రత కరవవుతోంది. ఇలాంటి అనేకానేక విషాదాంతాలకు పోలీసు యంత్రాంగం మౌనసాక్షిగా నిలుస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా, వేలాది మంది పోలీసులతో కూడిన కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉన్న హైదరాబాద్‌లో తోడేళ్లూ పంజా విసురుతున్నారంటే..అత్యాధునిక పోలీస్‌ వ్యవస్థ ఏం చేస్తుందన్న ప్రశ్నలు మనసున్న వారికి శరాలై తగులుతున్నాయి. ఫ్లైఓవర్‌ క్రీనీడ, కాలనీ అంచుల్లోని కాలిబాట, మెట్రో మలుపులు, రైల్వేస్టేషన్‌ పరిసరాలు, నివాస సముదాయాలకు కూత వేటు దూరాలు, ఎక్కడ అయితే ఏం మనుషుల అలికిడి తగ్గితే చాలు అరాచక శక్తులు నిద్ర లేస్తున్నాయి. ఇలాంటి అనేకానేక చోట్లు నగరంలో ఉన్నాయి. అందుకే మహిళలు, ఉద్యోగినులు ఎల్లప్పుడు మీ దగ్గరా ఉప్పుకలిపిన కారం పొడి పాకెట్స్ ముందు జాగ్రత్తగా ఉంచుకోండి మీమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇదొక ఆయుధంగా కాసేపు ఉపయోగపడుతుంది.

Related posts