telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీలోకి వచ్చే ఎమ్మెల్యేలకు జగన్ షరతులు

jagan on ap assembly sessions

ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి వైసీపీలోకి వచ్చే ఎమ్మెల్యేలకు షరతులు విధించారు. గురువారం నాడు అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఎన్నిక అనంతరం జగన్ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఫిరాయింపుల వ్యవహారాల గురించి ప్రస్తావనకు తెచ్చారు. ఫిరాయింపులను ప్రొత్సహిస్తే చంద్రబాబుకు.. నాకు తేడా ఉండదని చెప్పాను. టీడీపీ నుంచి ఎవరినైనా ఎమ్మెల్యేలను మేం తీసుకుంటే రాజీనామా చేయించే తీసుకుంటామని స్పష్టం చేశారు.

గతంలో మా పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను కొన్నారు. అటువంటి పార్టీకు అన్నే సీట్లు వచ్చాయి. దేవుడి స్క్రిప్ట్ చాలా గొప్పది.‘బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ.. బ్యూటీ ఆఫ్ గాడ్స్ గ్రేస్’ ఎలా ఉంటుందో ఈ సభను చూస్తే తెలుస్తోంది.టీడీపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలను తీసుకుంటే ప్రతిపక్షం అనేది ఉండదు కదా అని నాతో కొందరు అన్నారు. విలువలు కాపాడే ప్రయత్నంలో భాగంగానే తమ్మినేని ఎన్నుకున్నామన్నారు.సభా సంప్రదాయాలను గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వని పరిస్థితి గతంలో  సభలో కన్పించిందని గుర్తు చేశారు. 

Related posts