telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగచైతన్య మూవీలో ముగ్గురు హీరోయిన్లు !

Avika

అక్కినేని హీరో నాగచైతన్య, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఓ అందమైన ప్రేమకథగా రూపొందింది. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాట ప్రోమోలు, ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అనుకున్న స్థాయికంటే ఎక్కువగానే ఆకర్షించాయి. ఇది ఇలా ఉండగా.. చైతూ ప్రస్తుతం థాంక్యూ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీని దిల్‌రాజ్‌నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో హాకీ ఆటగాడిగా చైతూ కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో రాశీఖన్నా, ఎవడే సుబ్రమణ్యం ఫేం మాళవిక నాయిర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజా సమాచారం ప్రకారం… నాగా చైతన్యతో రొమాన్స్‌ చేసేందుకు మరో భామను ఎంచుకున్నారట. “ఉయ్యాలా జంపాలా” ఫేం అవికా గోర్‌ ఈ సినిమాలో నటించనున్నట్లు టాక్. చైతూతో మొదటిసారి ఈ ముగ్గురు నటిస్తుండటంతో ఆసక్తి నెలకొంది. కాగా… చైతూ, సాయిపల్లవి జోడీగా చేసిన లవ్‌స్టోరీ కూడా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నెల 16న థియేటర్లలో రిలీజ్‌ కానుంది.

Related posts