telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ట‌క్ జ‌గ‌దీష్”గా నాని… టైటిల్ పోస్టర్ విడుదల

Nani

నేచుర‌ల్ స్టార్ నాని త‌న 26వ చిత్రాన్ని నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడు నాని. రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్య రాజేష్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని షైన్‌వూస్కీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌పెద్ది నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని జనవరిలో సెట్స్‌మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి “ట‌క్ జ‌గ‌దీష్” అనే టైటిల్ ఫిక్స్ చేసి పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ట‌క్ జ‌గ‌దీష్ చిత్రం త‌ల్లి- కొడుకుల నేప‌థ్యంలో సాగ‌నుండ‌గా, ఇందులో నానికి ఆరుగురు సోద‌రులు ఉంటార‌ట‌. ఈ చిత్రంలో నాని ట‌క్ జ‌గ‌దీష్‌గా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తాడ‌ని చెబుతున్నారు. కాగా నాని విభిన్న పాత్ర‌ల‌తో ప్రేక్షకుల‌ని అల‌రిస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. చివ‌రిగా “జెర్సీ” చిత్రంలో క్రికెట‌ర్‌గా అల‌రించిన నాని, ఆ త‌ర్వాత “గ్యాంగ్ లీడ‌ర్‌”గా వచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. ఇక ఈసారి కాస్త వినూత్న పాత్ర‌లో క‌నువిందు చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు.

Related posts