telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీలో .. మళ్ళీ పాతతరహా గ్రామ పరిపాలనా వ్యవస్థ..

ap map

ఏపీలో దాదాపు మూడు దశాబ్దాల క్రితం రద్దయిన కరణం, మున్సిఫ్ వ్యవస్థను మళ్లీ ప్రవేశపెట్టాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు ఓ పత్రిక ప్రచురించింది. ఎన్టీఆర్ 1983లో తొలిసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఈ వ్యవస్థను రద్దు చేశారు. ఏపీలో కరణం – మున్సిఫ్, తెలంగాణలో పటేల్ – పట్వారీ అమల్లో ఉండేది. వారు గ్రామాల్లో రెవిన్యూ వ్యవస్థను చూసుకునేవారు. గ్రామాల్లో భూముల సరిహద్దులు, భూ రికార్డుల నిర్వహణ, శిస్తు వసూలు చేసేవారు. ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత దీన్ని రద్దు చేశారు. అయితే, ఈ విధానాన్ని మళ్లీ అమల్లోకి తీసుకురావాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న వీఆర్వోలు, వీఆర్ఏలు, సర్వేయర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులను ఒక గూటికిందకు తెచ్చి.. భూ రికార్డుల ప్రక్షాళన చేయాలనేది జగన్ మోహన్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది. కొత్త గ్రామ సచివాలయాలకు తాజాగా జరిపిన నియామకాల్లో దాదాపు అన్ని సర్వేయర్ల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. వీఆర్వోలు, సర్వేయర్లు.. కరణం – మున్సిఫ్ తరహాలో వ్యవహరిస్తారని సమాచారం. కరణం – మున్సిఫ్ వ్యవస్థ అమల్లో ఉన్న సమయంలో భూరికార్డుల నిర్వహణ అత్యంత సమర్థంగా జరిగేదని, ఎలాంటి భూ వివాదాలు ఉండేవి కావని రెవిన్యూ మంత్రి సుభాష్ చంద్రబోస్ చెప్పడంతో ప్రభుత్వం దీనిపై ముందడుగు వేసే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.

Related posts