మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని `నకిలీ`తో హీరోగా మారాడు. తర్వాత `డా.సలీమ్`, `బిచ్చగాడు`, `యమన్`, `భేతాళుడు`, `ఇంద్రసేన`, `రోషగాడు` వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నెల 5న `కిల్లర్`గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విజయ్ ఆంటోని. సాధారణంగా తన సినిమాలకు సంగీత బాధ్యతలను నిర్వహించే ఈయన `కిల్లర్` సినిమాకు మాత్రం సంగీతం అందించలేదట. అందుకు కారణం.. మంచి స్క్రిప్ట్స్‌ను ఎంచుకోవడంతో పాటు నటనపైనే పూర్తిగా ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడట విజయ్ ఆంటోని. అందుకని రెండు, మూడేళ్ల వరకు సంగీత దర్శకత్వం వహించనని విజయ్ ఆంటోని తెలిపారు. `కిల్లర్` చిత్రానికి సైమన్స్ సంగీతాన్ని అందించాడు.
previous post
next post
బిగ్ బాస్, శ్రీముఖిలపై హిమజ సంచలన వ్యాఖ్యలు