telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

శివాజీ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ

hero shivaji comments Cm kcr

టీవీ 9 నూతన యాజమాన్యం అలంద మీడియా ఫిర్యాదు మేరకు హీరో శివాజీ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రో శివాజీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ కేసు విచారణకు హాజరుకావాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపినా శివాజీ విచారణకు హాజరు కాలేదు.

ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో శివాజీ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, తనను పోలీసులు ముందస్తు అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాలని కోరుతూ క్వాష్ పిటిషన్ లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్ పై న్యాయస్థానం ఈరోజు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.

Related posts