telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ కార్మికులు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేందుకు పలు ఏర్పాట్లు

Tsrtc increase salaries double duty employees

తెలంగాణలో సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటి అర్ధ రాత్రి ముగియనున్న నేపథ్యంలో కార్మికులు తమ జాయినింగ్ రిపోర్ట్ లు సమర్పించేందుకు పలు అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన గడువు లోగా విధుల్లో చేరాలనుకునే ఆర్టీసీ కార్మికులు తాము పనిచేస్తున్న డిపో మేనేజర్లకే కాకుండా ఇంకా పలుచోట్ల తమ జాయినింగ్ లెటర్స్ ఇవ్వొచ్చని తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ తెలిపారు.

విధుల్లో చేరడానికి సిద్ధమైన కార్మికులు ఆయా డిపో మేనేజర్లకే కాకుండా, డీవీఎం కార్యాలయాలు లేదా ఆర్ ఎం కార్యాలయాలతోపాటు, ఆయా జిల్లాల కలెక్టరేట్ లు, ఎస్పీ, ఆర్డీవో, డిఎస్పీ కార్యాలయాల్లో కూడా తమ జాయినింగ్ పత్రాలను సమర్పించ వచ్చన్నారు. హైదరాబాద్‌లో పని చేసే కార్మికులు బస్ భవన్‌లోనీ ఎగ్జ్సిక్యూటివ్ డైరెక్టర్ కార్యాలయాల్లో లేఖలు అందించవచ్చని తెలిపారు.

Related posts