telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతిని కూల్చేసేలా సీఎం జగన్ చర్యలు: కేశినేని నాని

jagan kcr photo

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ నేత, విజయవాడ లోక్ సభ సభ్యులు కేశినేని నాని మరోసారి సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు. “అమరావతిని కూల్చేద్దాం..హైదరాబాద్ ను అభివృద్ధి చేద్దాం” అనేలా సీఎం జగన్ చర్యలు ఉన్నాయని కేశినేని నాని విమర్శించారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రజావేదికను కూల్చేశారనీ మండిపడ్డారు. అలాగే గన్నవరం-సింగపూర్ విమాన సర్వీసును రద్దుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాత్రం హైదరాబాద్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ మేరకు కూల్చివేసిన ప్రజావేదిక ఫొటోను కే నాని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Related posts