ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు మోసం చేశారని అన్నారు. రిజర్వేషన్లపై పోరాడినవారిని అరెస్టు చేసి జైల్లో పెట్టారని గుర్తు చేశారు. తుని ఘటనలో తమపై అక్రమంగా కేసులు పెట్టారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఒక్కరిని కూడా విచారించలేదని తెలిపారు.
తుని ఘటనపై విచారణ చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కోరారు. కేంద్రం అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే… అందులో 5 శాతం కాపులకు ఇచ్చామంటూ బాబు చెప్పుకున్నారు. కాపులను దశలవారీగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. హైదరాబాద్ వదిలి ఆగమేఘాలపై ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికినందుకేనా అని అంబటి ప్రశ్నించారు.