telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ కరోనా అప్డేట్…

corona

ఆంధ్రప్రదేశ్ కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే వున్నాయి. అయితే…ఇవాళ మాత్రం కేసులు కాస్త తగ్గాయి. ఇప్పటికే రాష్ట్రంలో 8.57 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,236 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,57,395కి చేరింది. ఇందులో 17,892 కేసులు యాక్టివ్ గా ఉంటే… 8,33,980 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 6,899 కి చేరింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా తీసుకుంటే అనంతపూర్ లో 49, చిత్తూరులో 157, తూర్పు గోదావరిలో 155, గుంటూరులో 181, కడపలో 60, కృష్ణాలో 194, కర్నూలులో 26, నెల్లూరులో 38, ప్రకాశంలో 24, శ్రీకాకుళంలో 51, విశాఖపట్నంలో 53, విజయనగరంలో 28, పశ్చిమ గోదావరిలో 220 కేసులు నమోదయ్యాయి.

Related posts