telugu navyamedia
వార్తలు సామాజిక సినిమా వార్తలు

మహేశ్ బాబు అందం గురించి సుమ ప్రశంసలు

TV Anchor Suma meet KTR

ప్రిన్స్ మహేశ్ బాబు అందం గురించి ప్రముఖ యాంకర్ సుమ ప్రశంసించారు. ‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ చందమామ వెన్నెల గురించి మహేశ్ బాబు అందం గురించి మనం చెబుతూనే ఉంటామని అన్నారు. మహేశ్ అందం గురించి రాజకుమారుడు సినిమా నుంచి ఇప్పటి వరకూ చెబుతూనే ఉన్నామని అన్నారు. దేవుడు కొంతమందికి అన్నీ కరెక్టు కొలమానాల్లో ఇస్తారని తెలిపారు.

కొంత మందికి అందం ఇచ్చి బుర్ర సరిగ్గా ఇవ్వరు కానీ, మహేశ్ బాబుకు అందం, బుర్ర ఇచ్చాడని అభివర్ణించారు. ఆయన అందం పెరుగుతుంది, అహం మాత్రం పెరగదని సుమ కొనియాడారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మహేశ్ బాబు.. సుమకు థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు. ఆమెను సక్సెస్ మీట్ కు వ్యాఖ్యాతగా రావాలని అడగగానే వచ్చినందుకు సంతోషమని అన్నారు. ఆమె వస్తే తనకు ఓ ఎనర్జీ వచ్చినట్టు ఉంటుందని మహేశ్ తెలిపారు.

Related posts