telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సియాచిన్‌లో పనిచేసే సైనికులు కన్పిస్తే కాళ్లకు దండం పెడతా… : పూరి జగన్నాథ్

Puri

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాద్ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న పోడ్ కాస్ట్ ద్వారా ద్వారా ఎన్నో విషయాలను ఆయన చర్చిస్తున్నాడు. తాజాగా పూరి పోడ్ కాస్ట్ దేశభక్తి ఉప్పొంగేలా సైనికుల సేవలను కొనియాడారు. “1895లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఇండియన్‌ ఆర్మీని ప్రారంభించింది. ‘సిపాయి’ అనే పేరు వాళ్లే పెట్టింది . 1914లో మొదటి ప్రపంచం యుద్ధంలో భారతసైన్యం బ్రిటీష్‌వారి తరఫున పోరాడింది. దాదాపు 60 వేల మంది సైనికులు ప్రాణాలు విడిచారు. బుల్లెట్లు తగిలి 100 మంది వరకూ నర్సులు చనిపోయారు. భారతసైన్యంలో ప్రస్తుతం 10 వేల మంది వరకూ మహిళలు వివిధ విభాగాల్లో ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్‌, చైనాతో 4 యుద్ధాలు చేశాం. సియాచిన్‌లో మైనస్‌ 15 డిగ్రీల సెల్సియస్‌ చలిలో డ్యూటీలు చేస్తుంటారు మన సైనికులు. అక్కడ చలి తీవ్రతకు చేతివేళ్లు, చెవులు రాలిపోతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో డ్యూటీ చేయాలంటే దమ్ముండాలి. దేశమంటే ప్రేముండాలి. మనం దొబ్బి తిని పండుకుంటాం ఇళ్లల్లో మనకేం తెలుసు వాళ్ళ కష్టాలు. అందుకే… సియాచిన్‌లో పనిచేసే సైనికులు కన్పిస్తే నేను వాళ్ల కాళ్లకు దండం పెడతా… యుద్ధాలే కాదు… దేశంలో ఏ కష్టమొచ్చినా ధైర్యంగా నిలబడేది సైనికులే. రాజస్థాన్‌, మహారాష్ట్ర, హరియాణ, పంజాబ్‌ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది భారతసైన్యంలో చేరతారు. వాళ్లు బయటికి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా.. లోపల ఎంతో సున్నితం. మనలా వారిలో ఎలాంటి క్రిమినల్‌ ఆలోచనలు ఉండవు. మన కోసం వాళ్లు కుటుంబాలను వదిలి, ప్రాణాలు పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్నారు. వాళ్లు కనిపిస్తే సెల్యూట్‌ చేయండి. వారితో సెల్ఫీ దిగండి… లవ్ యు అని చెప్పండి పొంగిపోతారు… జనగణమన” అంటూ పూరి తన ప్రసంగాన్ని ముగించారు.

Related posts