telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దొరసానిపై .. శ్రీరెడ్డి కౌంటర్…

srireddy conter on dorasai movie to jivita

‘దొరసాని’ సినిమాలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ప్రధానపాత్రలలో నటించారు. నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. శివాత్మిక, ఆనంద్ దేవరకొండ వెండితెరపై మొదటిసారి మ్యాజిక్ చేసి ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. తాజాగా ఈ సినిమా విషయంలో జీవితతో గెలుక్కుంది శ్రీ రెడ్డి.

ఈ సినిమాలో ఓ లిప్ లాక్ సీన్ ఉంది. కథలో భాగంగా ఆ సీన్ ఉండి తీరాల్సిందే. అందుకే ఆ సీన్ షూట్ చేశారు మేకర్స్. దీన్నే టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి అటాక్ చేయడం ప్రారంభించింది. ‘దొరసాని’ సినిమా హిట్టా? ఫ్లాపా? శివాత్మికను దేవరకొండ కిస్ చేశాడా?? ఈ విషయంపై లైవ్ లోకి వస్తా.. మాట్లాడుకుందాం అంటూ ఓ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి.

ఇలా శ్రీరెడ్డి కాంటర్ ఇవ్వడానికి కూడా కారణం ఉంది, గతంలో ‘ఇప్పటి సినిమాల్లో లిప్‌లాక్స్ ఒకరి మీద ఒకరు పడటం లాంటి సీన్స్ ఎక్కువైపోతున్నాయి.. బెడ్ రూమ్‌లో చేయాల్సిన పనులు రోడ్డు మీద చేస్తామా’ అంటూ గతంలో జీవిత చేసిన కామెంట్స్‌ని గుర్తు చేస్తూ నాటి వీడియోను షేర్ చేసింది శ్రీ రెడ్డి. ఈ మేరకు ‘జీవిత గారూ ఇది మీకు గుర్తుందా’ అంటూ చురకలంటిస్తూ శ్రీరెడ్డి ఈ పోస్ట్ వదలటం గమనార్హం. దీనిపై ఇంకా జీవిత స్పందించాల్సి ఉంది.

Related posts