telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

భయపడొద్దు…భయపడొద్దు..

యోగులు… జోగినీలు సంచరించిన గడ్డే…
మోక్షంకై..అరాటపడుతూ భోగంకై వంచించ పడుతూ
యోధులు..విరోధులు ఘర్షించిన చోటే…
యుక్తితో..గెలుస్తూ కుయుక్తితో..ఓడిస్తూ..
భయపడొద్దు…భయపడొద్దు..
మిన్నాగులూ..బైరాగులు పారాడే నేలే…
విషం కక్కుతూ ఒకరు..వైరాగ్యంతో మరొకరు
సంయుక్తులు…కుయుక్తులు నడయాడే భూమే
అందరినీ కలుపుతూ…ఇరువురినీ విడదీస్తూ..
మంచి…చెడు.. కలిసిపోయి
ఎల్లప్పుడూ విభేదిస్తూ..
మరెన్నడూ ఏకీభవించక
సాగే ఈ పయనంలో..
వేసుకున్న బట్టలపై..
గునపాలతో గుచ్చినా
రంపంతో కోసినా..
చెయ్యేసినా…తాకినా
కిమ్మనకుండా మూడేంకవేసుకొని
ముడుచుకొని మూసుకొని పడుకోక
ఇలా గోల చేసేస్తే ఎలా….
వాళ్లేమన్నా మిమ్మల్ని
చేత్తో తాకారా ఏమైనా…?
అర్నీ ఎంత మాట…ఎంత కూత…?
ఇదే మాట ఇంట్లో కూయ్…
గూబ గుయ్మనకుంటే చెప్పు…
మిత్రోస్…
ఎంత కూరగాయలు తరిగితే మాత్రం..
కూరగాయలను కోసినట్లు
కోసేస్తామంటే ఎలా…
గడపలకు పసుపు పూయడమే కాదూ
గండ్ర గొడ్డలితో అడ్డంగా నరికే
కాళీ మాతలమని మరవొద్దు…
ఇంకా ప్రేమతోనే బ్రతికేస్తాం అంటే ఎలా..
కాస్త ఆలోచించి తెలివిగా..
చేతులకు గాజులు తీసేసి
గ్లౌజులు వేసుకొని…అప్పుడు కొస్తాం
ఏ డైమన్షన్స్ కావాలంటే ఆ డైమన్షన్స్ లో..
చెప్పులకు కవరేసి బడిత పూజ చేద్దాం..
వండటం వార్చడమే కాదూ…
వడ్డించడం ఇంకాస్త బాగా వచ్చని…
గట్టిగా చెప్పేద్దామా…
ఏమంటారు….మిత్రోస్…
డోంట్ ఆస్క్ అజ్ ఎనీ క్వశ్చన్స్..
యు హ్యావ్ నో అథారిటీ ..
వై బికాజ్ …
యు డిడెంట్ డ్రింక్ మదర్ మిల్క్…
డోంట్ డిస్టర్బ్ అజ్ బ్లడీ……….
పై ఇంగ్లీపీసు వాక్యాలు
అమ్మ పాలు త్రాగని
చీము నెత్తురు లేని
ఉండాకోర్లకు మాత్రమే..

Related posts