telugu navyamedia
క్రీడలు వార్తలు

ఫిట్‌నెస్ పరీక్ష పాస్ అయితేనే జట్టులోకి : కోహ్లీ

భారత జట్టులోకి వచ్చే రావాలనుకునే ఆటగాళ్లకు కోహ్లీ వార్మింగ్ ఇచ్చాడు. ఎవరైనా సరే ఫిట్‌నెస్ పరీక్షలో పాస్ అయితేనే జట్టులోకి ఎంట్రీ అని స్పష్టం చేసాడు. అయితే ఇంగ్లాండ్ టీ 20 సిరీస్ కు ఎంపికైన ఆటగాళ్లలో వరుణ్ చక్రవర్తి, రాహుల్ టెవాటియాలు బీసీసీఐ ఇటీవల నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో విఫలమయిన విషయం తెలిసిందే. దీని పై కోహ్లీ మాట్లాడుతూ… ‘టీమ్‌లో అత్యుత్తమ ప్రమాణాలు, ఫిట్‌నెస్‌కి అధిక ప్రాధాన్యత ఇస్తాం. అందుకే ఇప్పుడు భారత్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. టీమిండియా‌కి ఆడాలంటే ఆటగాళ్లు ఆ ప్రమాణాల్ని అందుకోవాలని మేము ఆశిస్తున్నాం. ఎవరైనా సరే ఫిట్‌నెస్ టెస్టు పాస్ అయితేనే జట్టులోకి వస్తారన్నాడు కోహ్లీ.” బీసీసీఐ యో-యో పరీక్షలో ఆటగాళ్లు 17.1 స్కోర్ చేయాలి లేదా రెండు కిలోమీటర్లను 8 నిమిషాల 30 సెకన్లలలో పూర్తిచేయాలి. ఫాస్ట్ బౌలర్లు అయితే రెండు కిలోమీటర్లను 8 నిమిషాల 15 సెకన్లలలోనే పూర్తి చేయాలి.

Related posts