telugu navyamedia
క్రీడలు

కోహ్లీ ఖాతాలో కొత్త రికార్డు..

న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్టు క్రికెట్ మ్యాచుల్లో అత్యుత్తమ ప్రదర్శనచేసిని టీమిండియా టెస్టు ర్యాంకులో అగ్రస్థానం కైవసం చేసుకుంది. 124 రేటింగ్ తో 3465 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. జట్టు సభ్యులు మెరుగైన ప్రదర్శన చేశారు… ఇదే తరహాలో ప్రదర్శన భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పేర్కొన్నారు.

న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టుమ్యాచులో విజయంకోసం ఆఖరిదాకా పోరాడిన తీరును గుర్తుచేశారు. అన్ని విభాగాల్లో ప్రదర్శించిన ప్రతిభతో న్యూజిలాండ్ ను తక్కువ పరుగులకు కట్టడిచేయగలిగామనే అభిప్రాయం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో జరిగే మ్యాచుల్లో టీమిండియా సభ్యులు ఇదే తరహా ప్రదర్శనచేస్తారని, మరిన్ని విజయాలను సొంతంచేసుకుంటామని పేర్కొన్నారు. బ్యాటింగ్ తో అత్యుత్తమ ప్రదర్శన చేసిన మయాంక్ అగర్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. తొలి టెస్టు మ్యాచులో ఆరు, రెండో టెస్టు మ్యాచులో 8 వికెట్లు పడగొట్టిన రవిచంద్రన్ అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు.

Image

 

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన టెస్టు క్రికెట్ మ్యాచ్ విజయంతోపాటు… సిరీస్ కైవసం చేసుకోవడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో సరికొత్త రికార్డు నమోదైంది.
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 372 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించడంతో… ఇంటర్నేషనల్ టెస్టు క్రికెట్‌ చరిత్రలో 50 విజయాలు నమోదు చేసిన మొదటి కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు. కోహ్లీ సారథ్యంలో సాధించిన ఈ అరుదైన రికార్డుపై బీసీసీఐ స్పందించింది.. కోహ్లీకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా టీమ్‌ఇండియా 153 వన్డే, 59 టీ20 మ్యాచుల్లో విజయం సాధించారు. అయితే కోహ్లీ టీ20 ఫార్మాట్ కెప్టెన్‌గా తప్పుకున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

 

 

Related posts