telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంలో చూడాలి : సజ్జల

Sajjala ycp

ఈ కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుని వచ్చిన విధివిధానాలు దురదృష్టకరం అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. వైద్య సదుపాయాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పోల్చితే ఏపీలో తక్కువ అని తెలిపారు. బెంగళూరు, చెన్నై నగరాలకు కూడా వెళుతున్నారు…అక్కడ ఇబ్బంది లేదు. తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నాం. సెకండ్ కండ్ వేవ్ కరోనా తీవ్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం తీసుకుని వచ్చిన విధివిధానాలు ఆచరణ రీత్యా సాధ్యం కాదు. 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంలో చూడాలి. సుప్రీంకోర్టు కూడా దేశాన్ని ఒక యూనిట్ గా తీసుకుని కరోనా నియంత్రణ పై ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయనేది విచారిస్తోంది. ఎవరిదైనా ప్రాణమే అనేది ప్రభుత్వాలు గుర్తించాలి అని పేర్కొన్నారు.చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts