ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశం ప్రారంభమైంది. కోవలంలోని హోటల్ తాజ్ ఫిషర్‌మ్యాన్స్ కోవ్‌లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ప్రాంతీయ సహకారం వంటి అంశాలతో పాటు అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. చెన్నై సమీపంలోని మామల్లపురంలో శుక్రవారం ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీయైన విషయం తెలిసిందే.
నిన్నటి భేటీ సందర్భంగా మహాబలిపురంలోని చారిత్రక కట్టడాలు అర్జున తపస్సు, కృష్ణుడి వెన్నముద్ద రాయి, ఐదు రథాలు, షోర్ టెంపుల్ కాంప్లెక్స్‌ను ఇరువురు నేతలు సందర్శించారు. ప్రధాని మోదీ, మహాబలిపురంలో జిన్ పింగ్ కు ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ విందుకు అధ్యక్షుడితో పాటు చైనా నుంచి వచ్చిన అధికారులు, భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
రేపు పాకిస్థాన్ కూడా టార్గెట్.. ఆరెస్సెస్ పై ఇమ్రాన్ ఫైర్