telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

ఆర్మీ లో .. బిఎస్సీ నర్సింగ్‌ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం.. ఉచితం…

free bsc nursing in army medical colleges

ఆర్మీ వైద్యవిభాగం లోని వివిధ కళాశాలలో బిఎస్సీ నర్సింగ్‌ కోర్సుకు ప్రకటన వెలువడింది.. ఈ కోర్సుకు ఎంపికైనవారు ఉచితంగా నాలుగేళ్ల బిఎస్సీ నర్సింగ్‌ కోర్సు చదువుకోవచ్చు. ఈ సమయంలో వసతి, భోజనం అంతా ఉచితమే. కోర్సు అనంతరం మిలిటరీ నర్సింగ్‌ సర్వీస్‌లో లెఫ్టినెంట్‌ హోదాతో విధులు నిర్వహించవచ్చు.. బిఎస్సీ నర్సింగ్‌ కోర్సు పూర్తిచేసుకున్నవారిని లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. వీరిక ఇరూ.56,100 మూలవేతనం అందుతుంది.. అన్నీ కలుపుకుని మొదటి నుల నుంచే రూ.లక్ష వరకు వేతనంగా పొందవచ్చు. మూడేళ్ల సర్వీస్‌తో కెప్టెన్‌ హోదా సొంతం చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా 6చోట్ల పుణె, బెంగళూరు, కోల్‌కతా, లక్నో, న్యూఢిల్లీ, అశ్వని ల్లోని డిఫెన్స్‌ సంస్థల్లో బిఎస్సీ కోర్సు అందిస్తున్నారు. వీటిలో మొత్తం 220 సీట్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో 90 నిముషాల వ్యవధితో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో జనరల్‌ ఇంగ్లీష్‌, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ , జనరల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్షలో ప్రతిభ చూపినవారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.. పరీక్ష ఇంటర్వ్యూల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అర్హులకు వైద్యపరీక్షలు నిర్వహించి కోర్సులోకి తీసుకుంటారు.. పరీక్షలు ఏప్రిల్‌లో , ఇంటర్వ్యూలో మేలో నిర్వహిస్తారు.

అర్హత: బైపిసి గ్రూపుతో ఇంటర్‌లో మొదటి ప్రయత్నంలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు అర్హులే.. ఈ కోర్సు మహిళలకు మాత్రమే.

వయసు: అక్టోబర్‌ 1, 1995 నుంచి సెప్టెంబర్‌ 30 2003 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎత్తు కనీసం 152సెం.మీ ఉండాలి.ఆన్‌లైన

దరఖాస్తులకు చివరి తేదీ : డిసెంబర్‌ 2.

Related posts