telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రికార్డులు సృష్టిస్తున్న అఖిల్ ప్లాప్ సినిమా…!!

akhil

అక్కినేని అఖిల్ హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందించిన సినిమా “మిస్టర్ మజ్ను” సినిమా హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. తెలుగులో ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇటీవల ఈ సినిమాను హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్‌లో విడుదల చేశారు. అప్‌లోడ్ చేసిన 40 గంటల్లోపే ఈ సినిమా 20 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. ఇక నెల రోజుల్లో వంద మిలియన్లకు పైగా వ్యూస్ తెచ్చుకోవడం పాటు 1.3 మిలియన్ లైక్స్ కూడా సాధించింది. దక్షిణాది సినిమాలు ఉత్తరాదిన భారీ ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఇక్కడి ఫ్లాప్ సినిమాల డబ్బింగ్ వెర్షన్‌లు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తున్నాయి. “సవ్యసాచి”, “ఛల్ మోహన రంగా”, “శ్రీనివాస కల్యాణం”, “డీజే”, “జయ జానకీ నాయక” వంటి ఎన్నో సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్‌లు యూట్యూబ్‌లో వంద మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకున్నాయి.

Related posts