telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

షర్మిల పార్టీపై ఈటల సంచలన వ్యాఖ్యలు !

తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్న షర్మిల.. ఆ తర్వాత రోజు.. ముఖ్య అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.. వైఎస్‌ షర్మిల పార్టీ పెడతారని వార్తలు రాగానే ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి. ఆంధ్ర పార్టీలకు ఇక్కడ స్థానం లేదని.. మళ్లీ ఆంధ్ర పాలకులు తమకెందుకని తెలంగాణ నాయకులు అంటున్నారు. అయితే.. తాజాగా మంత్రి ఈటల రాజేందర్‌ కూడా దీనిపై స్పందించారు. మతం ప్రాతిపదికన కొత్త పార్టీలు వస్తున్నాయని.. మనిషి గురించి ఆలోచించేవారికే ప్రజల మద్దతు ఉంటుందని మంత్రి ఈటల పేర్కొన్నారు. కొత్తగా వచ్చే వాళ్లకు ఈ ప్రాంతంలో ఏం సంబంధమని.. సెంటిమెంట్స్‌ ఎక్కువకాలం పనిచేయవని స్పష్టం చేశారు. మతం పేరుతో వచ్చే ఇతర రాష్ట్రాలవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మతాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచనలు ఆగిపోవాలన్నారు. ప్రభుత్వం మార్వాడి కొట్టు కాదు.. పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థలకు అమ్ముకోవడం దుర్మార్గమని.. కేంద్రీకృత సంపద పేదరికానికి దారి తీస్తుందని పేర్కొన్నారు మంత్రి ఈటల.  

Related posts