telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ‌కు ప్ర‌ధానమంత్రే శ‌త్రువు..నెత్తికి రుమాల్ కట్టి వేషం తప్ప … నిన్నటి స్పీచ్‌లో ఏమైనా వుందా?

*కేంద్రంలో రాష్ర్ట హ‌క్కుల‌ను కాపాడే ప్ర‌భుత్వం రావాలి
*తెలంగాణ‌కు ప్ర‌ధానమంత్రే శ‌త్రువు ..
*మోదీ ఈ దేశానికి ఏం చేశారో చెప్పండన్న సీఎం కేసీఆర్
*రాష్ట్రం బాగుపడితే సరిపోదు…దేశం బాగుపడాలి
తెలంగాణ అన్నీ రంగాల్లో అభివృద్ధి పథంలో సాగుతోంది
*బీజేపీను నమ్మితే పెద్ద ప్రమాదం
*బీజేపీ జెండా పట్టుకుని నా బస్‌కు అడ్డం వస్తారా?
*బీజేపీ మన కడుపులు కొట్టి బడా వ్యాపారులకు దోచి పెడుతుంది
*తెలంగాణను స్వార్థ రాజకీయాలకు బలికాకుండా కాపాడుకోవాలి..

గాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి ప్ర‌ధాని మోదీపై విరుచుకుప‌డ్డారు. మోసపోతే.. గోస పడుతం.. మాయమాటలు నమ్మితే దోపిడీకి గురవుతం వచ్చిన తెలంగాణను గుంట నక్కలు పీక్కు తినకుండా చూడాలె అని సీఎం కేసీఆర్ వికారాబాద్‌లో ప్రజలకు పిలుపునిచ్చారు

 వికారాబాద్‌లో కేసీఆర్ నూతన కలెక్టరేట్‌ భవనం, టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ..రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తుందని, బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగుతోందన్నారు. చావు అంచుదాకా వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. సిద్ధించిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అయితే రాష్ట్రం బాగుంటేనే సరిపోదని, దేశం కూడా బాగుండాలని హితవు పలికారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోతాయని తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. కానీ ఇప్పుడు కర్ణాటకకు మించి భూముల ధరల పెరిగాయన్నారు. కర్నాటక కన్నా వికారాబాద్‌లో భూముల ధరలు ఎక్కువని, ఇక్కడ ఒక ఎకరం అమ్మితే అక్కడ మూడు ఎకరాలు కొనొచ్చని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడకపోతే వికారాబాద్‌ జిల్లా అయ్యేదా అని ప్రశ్నించారు. వికారాబాద్‌కు మెడికల్‌, డిగ్రీ కాలేజీలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

బీజేపీ ఎనిమిదేళ్లలో ఒక్క మంచిపని అయినా చేసిందా? అని ప్రశ్నించారు. సాక్ష్యాత్తు ప్రధాన మంత్రే తెలంగాణకు శత్రువు అయ్యాడు. సంస్కరణల పేరుతో మనకు శఠగోపం పెట్టి షావుకార్లకు నింపుతున్నారు.
ప్రధాని నిన్న గంట మాట్లాడారు. అంతా గ్యాసే. నెత్తికి రుమాల్‌ కట్టి వేషం తప్ప ఏముంది. డైలాగులు తప్ప దేశానికి మంచిమాట ఉందా. బీజేపీ జెండా పట్టుకొని నా బస్‌కు అడ్డం వసార్తా?. వికారాబాద్‌కు నేనేం తక్కువ చేశానో ప్రజలు చెప్పాలి. బీజేపీని నమ్ముకుంటే మనకు మళ్లీ పాత రోజులే వస్తాయి.

సమైక్య పాలనలోని బాధలు మళ్లా రావద్దంటే మనం జాగ్రత్తగా ఆలోచించాలన్నారు. మనకు ఉచిత కరెంటు ఉండాల్నా.. వద్దా? మీరే చెప్పండని కేసీఆర్ అక్క‌డ ప్ర‌జ‌ల‌ను ప్రశ్నించారు

Related posts