telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

జిహెచ్ఎంసీ ఓటర్ల జాబితాని విడుదల చేసిన ఎన్నికల కమిషన్…

ghmc hydeerabad

హైదరాబాద్ లో వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని 30 సర్కిల్ కార్యాలయాలు, రెవిన్యూ కార్యాలయాలు, వార్డు కార్యాలయంలో ఓటర్ల జాబితాని  సంబంధిత డిప్యూటీ కమీషనర్లు  ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల  కమీషన్ వెబ్ సైట్  లోనూ జాబితా ఉంచడం జరిగిందని, ఓటర్ల జాబితాలో తమ పేర్లను చెక్ చేసుకొని తమ పేర్లు లేకుంటే ఫారం 6 ద్వారా సంబంధిత అసెంబ్లీ ఎలక్టోరల్ అధికారి వద్ద ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేంత వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గ్రేటర్ లోని 150 వార్డులకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను కూడా సంబంధిత రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. ఈ పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను సంబంధిత సర్కిల్ కార్యాలయాలు, వార్డ్, ఆర్.డీ.ఓ, తహశీల్ కార్యాలయాలలో ప్రదర్శించనున్నారు. పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలను ఈ నెల 17 తేదీలోగా సమర్పించాలి. ఈ క్లెయిమ్ లను పరిశీలించి 21 .11 .2020 న సంబంధిత రిటర్నింగ్ అధికారులు తుది పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటిస్తారని తెలిపారు. 

Related posts