రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవ్ గన్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు . ప్రపంచ వ్యాప్తంగ మార్చి 25న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. సాధారణ థియేటర్లలో మొదటి మూడు రోజులకు రూ. 50 పెంపు, తర్వాత వారం రోజులకు రూ. 30 పెంచుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇక, మల్టీప్లెక్స్, ఐమాక్స్‌లో మొదటి మూడు రోజులకు రూ. 100 పెంపు, తర్వాత వారం రోజులు రూ. 50 పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
“ఆర్ఆర్ఆర్” విడుదలైన మొదటి 10 రోజుల పాటు ప్రత్యేక టిక్కెట్ ధరలను నిర్ణయించడానికి అంగీకరించింది. అంతేకాదు తొలి పది రోజుల పాటు ఉదయం 7 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు ఐదు షోలను ప్రదర్శించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.