telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగబాబుకు చిరంజీవి బర్త్ డే విషెస్

Chiranjeevi

మెగా బ్రదర్ నాగబాబు మెగాస్టార్ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నాగబాబు హీరోగా, సహాయ నటుడిగా, నిర్మాతగా రాణించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, బుల్లితెరపై పలు కామెడీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఇక రాజకీయంగానూ నాగబాబు అన్నయ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం, తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు నాగబాబు. 1961 అక్టోబర్ 29 వ తేదీన నాగబాబు మొగల్తూరూలో జన్మించారు. ఈరోజు నాగబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో నాగబాబు అన్నయ్య, మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “విధేయుడు, ఎమోషనల్‌ పర్సన్‌, దయగల హృదయమున్న వ్యక్తే కాదు.. చాలా సరదాగా ఉండే వ్యక్తి, నా సోదరుడు నాగబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని, నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాలని ఆశిస్తున్నాను!” అని ట్వీట్‌ చేశారు. దీనికి నాగబాబు కూడా ట్విట్టర్‌ ద్వారా “థాంక్స్‌ అన్నయ్య.. నేనెప్పుడూ నీతోడై ఉంటాను” అని స్పందించారు.

Related posts