telugu navyamedia
సినిమా వార్తలు

57 సంవత్సరాల “భామా విజయం”

నటరత్న ఎన్.టి. రామారావు గారు నటించిన జానపద చిత్రం శేఖర్ ఫిలిమ్స్ వారి “భామా విజయం”
29-06-1967 విడుదలయ్యింది.

కాశీమజిలీ కథలలో అత్యంత ప్రాచుర్యం పొందిన “గొల్లభామ” కథ ఆధారంగా నిర్మాతలు సోమశేఖర్, రాధాకృష్ణ లు శేఖర్ ఫిలిమ్స్ పతాకంపై ప్రముఖ దర్శకులు సి.పుల్లయ్య గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే: సోమశేఖర్, మాటలు: సముద్రాల రామానుజాచార్య (జూనియర్), సంగీతం: టి.వి.రాజు, పాటలు: సి.నారాయణరెడ్డి,సముద్రాల రాఘవాచార్య(సీనియర్),సముద్రాల రామానుజాచార్య (జూనియర్) , ఛాయాగ్రహణం: రవికాంత్ నగాయిచ్, కె.ఎస్.ప్రసాద్, కళ: కుదరవల్లి నాగేశ్వరరావు, నృత్యం: చిన్ని-సంపత్, పసుమర్తి కృష్ణమూర్తి, కూర్పు: ఎస్.పి.ఎస్.వీరప్ప, అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, దేవిక, ఎల్.విజయలక్ష్మి, విజయనిర్మల, రేలంగి, గిరిజ, ధూళిపాళ్ల, ముక్కామల, నాగయ్య, ఋష్యేంద్రమణి, రాజనాల, పుష్పవల్లి, రాజబాబు తదితరులు నటించారు.

ప్రఖ్యాత సంగీత దర్శకుడు టి.వి.రాజు గారి స్వరకల్పనలో
“పైరు గాలి వీచింది,పైట కొంగు తొలిగింది”
“రెండు చందమామలు ఈ రేయి వెలిగెనే”
“రారా సుందరా,ఇటు రారా సుందరా”
“మగరాయా, మగరాయా నిను చూడ చూడ”
వంటి పాటలు, పద్యాలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.

మంచి కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం విజయం సాధించి శతదినోత్సవం జరుపుకున్నది.

ఈచిత్రం విడుదలైన పలు కేంద్రాలలో 50 రోజులు, ఒక కేంద్రంలో (రాజమండ్రి – వెంకటనాగదేవి టాకీస్) లో 100 రోజులు ప్రదర్శింపబడింది.

రాజమండ్రి లో డిసెంబరు 21 వ తేదిన ఈ చిత్రం శతదినోత్సవం ఫంక్షన్ ను నిర్మాతలు, డిస్త్రిబ్యూటర్స్ నిర్వహించారు.

ఈ సినిమాకు మొదట నిర్ణయించిన “గొల్లభామ” టైటిల్ వివాదాస్పదం కావటంతో “భామావిజయం” గా
పేరు ను మార్చి విడుదల చేయటం జరిగింది. ప్రఖ్యాత దర్శకులు సి.పుల్లయ్య గారు దర్శకత్వం వహించిన చివరి సినిమా ఇదే కావటం విశేషం..

Related posts