telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

అయోధ్యలో మసీదు నిర్మాణం.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

asaduddin owisi

అయోధ్యలో మసీదు నిర్మాణం పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కదిలించేలా నిధుల సేకరణ జరుగుతోంది. అదే సమయంలో అయోధ్యలో మసీదు నిర్మాణానికి కూడా సిద్ధమవుతున్నారు ముస్లింలు.. అయితే, అయోధ్యలో మసీదు నిర్మాణం విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ.. అయోధ్యలో నిర్మించనున్న మసీదుకు చందాలు ఇవ్వడం తప్పని.. అలాంటి మసీదులో నమాజ్‌ కూడా చేయవద్దని మతపెద్దలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. అథర్ హుస్సేన్ చేసిన కామెంట్లపై సీరియస్‌గా స్పందించిన ఒవైసీ.. ఇక్కడ సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌కు నమాజ్ సమర్పించబడుతుందని అన్నారు. ఇక, తాము ఏకమైతే 70 ఏళ్లుగా రాజకీయ లబ్ధి పొందుతున్నవాళ్లను కూల్చగలమని పేర్కొన్న ఒవైసీ.. మరోవైపు ముస్లింపు ఒవరూ ఎన్నికల్లో దళితులపై పోటీ చేయొద్దని సూచించారు. అయోధ్య మసీదు ఇస్లామిక్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంది.. మత పెద్దల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తాను మాట్లాడుతున్నానని ఒవైసీ చెప్పారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ నుండి ఉలేమా కూడా దీనిని మసీదు అని పిలవకూడదని మరియు అక్కడ ప్రార్థనలు చేయలేమని పేర్కొన్నారని తెలిపారు.

Related posts