telugu navyamedia
సినిమా వార్తలు

పవన్ గెలిస్తే సీఎం… లేకపోతే సీఎంకు మొగుడు… తథాస్తు : వర్మ

RGV

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ పై తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నిన్నటివరకు మెగా ఫ్యామిలీని విమర్శలతో ముంచెత్తిన వర్మ తాజాగా వారిపైనే పాజిటివ్ గా స్పందించడం అనేది అందరికీ షాకిస్తున్న విషయం. “సీబిఎన్.. పీకేని గత ఎన్నికల్లో అలవాటు ప్రకారం వెన్నుపోటు పోడిచినందుకు, రానున్న ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తన నైజాంలో ఉన్న నిజాయితీతో నారా చంద్రబాబుని ముందుపోటు పొడుస్తాడని పీకే పవర్ మీద నా అత్యంత మెగా నమ్మకం” అని ట్వీట్ చేశారు. ఆ తరువాత కాసేపటికి “బ్రహ్మం గారు నాకు చెవిలో చెప్పారు… పవన్ కళ్యాణ్ గెలిస్తే సీఎం అవుతాడు… లేకపోతే గెలిచిన సీఎంకి మొగుడవుతాడు.. తథాస్తు” అంటూ మరో ట్వీట్ చేశారు వర్మ. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts