telugu navyamedia
రాజకీయ సినిమా వార్తలు

“పీఎం నరేంద్రమోడీ” బయోపిక్ కు గ్రీన్ సిగ్నల్

PM-Narendra-Modi-Biopic
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ “పిఎం నరేంద్రమోదీ”. ఎన్నికల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌ భారతీయ జనతా పార్టీకి లబ్ది చేకూరేలా, ప్రజలను ప్రభావితం చేసేలా ఉందని, సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు వేసిన పిటీషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీమ్‌ కోర్టు కొట్టివేసింది. అంతేకాదు విలువైన కోర్టు సమయాన్ని వృధా చేశారంటూ మండిపడింది.
కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నట్టు సినిమా భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూర్చేలా ఉందా? లేదా? అని నిర్ణయించాల్సింది ఎన్నికల కమీషన్‌ అని, సినిమా ఇంకా సెన్సార్‌ కానుందున ఈ పిటీషన్‌ను పరిగణనలోకి తీసుకోలేమని క్లారిటీ ఇచ్చింది కోర్టు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై మోదీ పాత్రలో నటించిన వివేక్‌ ఒబెరాయ్‌, చిత్రనిర్మాతలలో ఒకరైన సందీప్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. గతంలో సెన్సార్‌ బోర్డు సర్టిఫికేట్‌ ఇస్తే, సినిమా విడుదల విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ముంబై హైకోర్టుకు ఎన్నికల కమీషన్‌ తెలిపింది. సెన్సార్‌ కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి ఈ నెల 11న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం. 

Related posts