telugu navyamedia
సినిమా వార్తలు

‘సముద్రుడు’ టీజర్ విడుదల

samudrudu

కీర్తన ప్రొడక్షన్స్ పతాకం‌ఫై నగేష్ నారదాసి దర్శకత్వంలో బదావత్ కిషన్, శ్రీరామోజు జ్ఞానేశ్వర్, సోములు నిర్మించిన చిత్రం ‘సముద్రుడు’. రమాకాంత్, భానుశ్రీ అవంతిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను హీరో రమాకాంత్ జన్మదిన సందర్భంగా ప్రముఖ దర్శకుడు వి. సముద్ర మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. టీజర్ విడుదల అనంతరం దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ రమాకాంత్ నా సినిమాలన్నింటిలో నటించాడు. నేను అంటే తనకు చాలా అభిమానం. నా పేరుతో టైటిల్ పెడతాడని అనుకోలేదు. పాజిటివ్ టైటిల్. భానుశ్రీ నటించిన సినిమాలన్నింటికీ ఓపెనింగ్స్ బాగుంటాయి. ఈ సినిమాకు కూడా అలానే ఉండాలని అనుకుంటున్నా. దర్శకుడు నగేష్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. మంచి విజయాన్ని అందుకొని ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను..’’ అన్నారు. హీరో రమాకాంత్ మాట్లాడుతూ.. ‘‘నా కూతురు కీర్తన పేరు మీద ప్రొడక్షన్ మొదలుపెట్టాము. తను నాకు బాగా కలిసొస్తుందనే ఈ సినిమాను చేయడం జరిగింది. సినిమా విషయానికి వస్తే.. చేపలు పట్టే వారి జీవన శైలిపై తీసిన కథాంశం. ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్. చాలా కష్టపడి పనిచేసాము.. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను..’’ అన్నారు. హీరోయిన్ భానుశ్రీ మాట్లాడుతూ.. నరసింహాలో రమ్యకృష్ణగారి పాత్రలా ఉంటుంది నా క్యారెక్టర్. స్టోరీ వినగానే ఏం మాట్లాడకుండా ఓకే చెప్పేశా…మంచి పెర్ఫార్మన్స్ ఉన్న పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు నగేష్ గారికి నా కృతఙ్ఞతలు అని అన్నారు.

Related posts