telugu navyamedia
వార్తలు సామాజిక

ఆమె వంట తిన్నవారికి టైఫాయిడ్.. ద్వీపంలో బంధించి శిక్ష

typhoid fever

ఆమె పేరు మేరీ మల్లాన్, ఆమెకు వంట చేయడమంటే చాలా ఇష్టం. 1869, సెప్టెంబర్ 23న ఉత్తర ఐర్లాండ్‌లోని కూక్స్‌టౌన్ అనే గ్రామంలో మేరీ జన్మించింది. ఆమె వంటను ఎవరు తిన్నా టైఫాయిడ్‌కు గురయ్యేవారు. దీంతో ఆమెకు ‘టైఫాయిడ్ మేరీ’గా పేరొచ్చింది. అయితే, ఆమె మాత్రం ఏనాడు టైఫాయిడ్‌కు గురికాకపోవడం గమనార్హం.

1906లో చార్లెస్ హెన్రీ వారెన్ అనే వ్యక్తి, మరో పదిమంది కుటుంబ సభ్యులతో కలిసి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఆ ఇంట్లో ఆరుగురు టైఫాయిడ్ వ్యాధికి గురయ్యారు. అప్పటికి ఆ ప్రాంతంలో టైఫాయిడ్ ఉనికిలో లేదు. దీంతో ఈ వ్యాధి వారికి ఎలా సోకిందో అర్థం కాలేదు. ఈ వ్యాధులకు కారణం వంట మనిషి మేరీ అని తెలిసి వారెన్ కుటుంబికులు అవాక్కయ్యారు. ఆ ఇంట్లోవారు టైఫాయిడ్‌కు గురైన వారం రోజుల్లోనే ఆమె ఆ ఉద్యోగం వదిలిపెట్టింది. దీంతో సాపర్ ఆమె గురించి ఆరా తీశాడు. వంట మనిషి మేరీ ఎక్కడా పూర్తిగా పనిచేయదని, ఎప్పుడూ ఉద్యోగం మారుతూనే ఉంటుందని తెలుసుకున్నాడు. అంతేకాదు, ఆమె పనిచేసే ప్రాంతాల్లో టైఫాయిడ్ వ్యాపిస్తుందనే విషయం తెలిసి షాకయ్యాడు.

దీంతో సాపర్ ఆమె ఆచూకీ కనుగొని పోలీసులకు అప్పగించాడు. దీంతో మేరీని న్యూయార్క్ సముద్రం తీరానికి శివారులో గల నార్త్ బ్రదర్ ద్వీపంలో బంధించారు. తన వల్ల టైఫాయిడ్ వ్యాపిస్తోందనేది అపోహ మాత్రమేనని మేరీ వాదించింది. నాలో టైఫాయిడ్‌కు చెందిన ఎలాంటి బ్యాక్టీరియా లేదని వైద్యులు చెప్పారు. నేను నిర్దోషిని అని ఆమె వాపోయింది. దీనిపై ఆమె న్యూయార్క్ స్టేట్ బోర్డ్ ఆఫ్ హెల్త్‌కు కూడా ఫిర్యాదు చేసింది.

Related posts