telugu navyamedia
క్రీడలు వార్తలు

హైదరాబాద్ ఓటమికి మనీశ్ పాండేనే కారణం : సెహ్వాగ్

నిన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌‌ చివరివరకూ పోరాడినా ఓటమి తప్పలేదు. కోల్‌కతా నిర్దేశించిన 189 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరెంజ్‌ ఆర్మీ గెలుపు అంచుల వరకు వెళ్లి చతికిలబడింది. జానీ బెయిర్‌స్టో (55), మనీష్‌‌ పాండే (61*) రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. నిజం చెప్పాలంటే.. ఇన్నింగ్స్ చివర్లో మనీశ్ ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. దీంతోనే ఆరెంజ్‌ ఆర్మీ 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీని పై వీరేందర్ సెహ్వాగ్ మాట్లాడుతూ… ‘మనీశ్ పాండే ఇన్నింగ్స్ చివరి మూడు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఓ సిక్స్ కొట్టాడు. అప్పటికే మ్యాచ్ హైదరాబాద్ చేజారిపోయింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన మనీశ్.. చివర్లో బాధ్యత తీసుకుని బౌండరీలు కొట్టి ఉండాల్సింది. ప్రస్తుతం జట్టులో ముఖ్యమైన రోల్ ప్లే చేస్తున్నాడు. క్రీజులో కుదురుకున్నాడు, ఒత్తిడిలో ఆడిన అనుభవం కూడా ఉంది. అంత అనుభవం ఉండి ఏం లాభం. ఒకవేళ మనీశ్ హిట్టింగ్ చేసుంటే.. మ్యాచ్‌లో ఆరెంజ్‌ ఆర్మీ 10 పరుగుల తేడాతో ఓడిపోయేది కాదు’ అని అన్నాడు.

Related posts