telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మద్యం కావాలా.. ఆధార్ తప్పనిసరిగా చూపించాలి..

aadhar in mandatory on buying alcohol

ఇప్పటికే ప్రతి దానికి ఆధార్ అనుసంధానం చేసిన విషయం తెలిసిందే. మరో అడుగు ముందుకు వేసి, ఈ పద్దతి మద్యం దుకాణాలలో కూడా అమలు చేయాలని నిర్ణయించారు. అంటే ఇకమీదట మద్యం కావాలంటే, ఆధార్ చూపించాల్సిందే. మద్యం ప్రియులకు షాకిస్తూ మద్యం కొనుగోలు చేయాలంటే ఆధార్ కార్డును తప్పని సరి చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తోంది. మద్యం బాటిళ్లు, టెట్రా ప్యాకెట్ల ద్వారా పరిసరాలు కలుషితమవుతున్నట్టు ఇటీవల చాలా ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. మద్యం తాగిన తర్వాత బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ విసిరిపారేస్తూ సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాలు, మైదానాలు, ఉద్యానవనాల్లో ఖాళీ బాటిల్ ను పడేస్తూ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు.

ఇటీవల కాలంలో నదులు, చెరువుల్లోనూ ఖాళీ మద్యం బాటిళ్లు, టెట్రా ప్యాకెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మద్యం బాటిళ్లు, ప్యాకెట్లు ఎక్కడ పడితే అక్కడ కనిపించడంపై మంగళూరుకు చెందిన పరిసర సంరక్షణ సంఘం సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఇక పై మద్యం కొనుగోలు చేసే వారు ఆధార్ కార్డును చూపించడం తప్పని సరిచేస్తే కొంత మేర సత్ఫలితాలు కనిపించే అవకాశం ఉందని నివేదికలో పేర్కొంది. సిఫార్స్ చేసిన సూచనలతో పాటు పూర్తి నివేదికను ఆధారంగా చేసుకొని మద్యం కొనుగోళ్ల పై ఆధార్ కార్డును తప్పని సరి చేద్దామని అబ్కారీ శాఖ కమిషనర్ కు ఆ శాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన కమిషనర్ సంఘం ఇచ్చిన సలహాలపై ప్రజాభిప్రాయం తీసుకోవాలని సూచించారు. ప్రజాభిప్రాయం ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు, సంఘం చేసిన కొన్ని సిఫార్స్ లు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని పలువురు అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. సంఘం చేసిన సిఫార్స్ లు మద్యం ప్రియులకు అనుకూలంగా ఉన్నాయని అధికారులు వాపోతున్నారు. మద్యం దుకాణదారులు కొనుగోలుదారుడి ఆధార్ నెంబర్ ను కంప్యూటర్ లో నిక్షిప్తం చేసి మద్యం విక్రయించాలి.

ఒకసారి కొనుగోలు చేసిన వ్యక్తి మరోసారి దుకాణానికి వస్తే మొదటి కొన్న మద్యం బాటిల్ ను తిరిగి అప్పగిస్తేనే కొత్త బాటిల్ ను విక్రయించాలి. ఎక్కడైనా ఖాళీ మద్యం బాటిళ్లు పడేసినట్టు కనిపిస్తే దానిపై ఉన్న బార్ కోడ్ స్కాన్ చేసి దాన్ని అమ్మిన మద్యం దుకాణానికి జరిమానా విధించాలి. అలాగే లైసెన్సు రద్దు చేయాలి. మద్యం మత్తులో తాగిన వారు ఎక్కడ పడితే అక్కడ పడకుండా వారిని అబ్కారీ శాఖ వాహనంలో సురక్షితంగా ఇంటికి చేర్చాలి. తాగడానికే మొత్తం డబ్బును ఖర్చు చేస్తే మద్యం ప్రియుల ఇంటికి కావలసిన నిత్యవసర సామాగ్రిని అబ్కారీ శాఖనే ఉచితంగా ఇవ్వాలి. రోజూ తాగడం వల్ల ఆరోగ్యం పాడైతే మద్యం ప్రియుడితో పాటు అతని కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు చికిత్స చేయించాలి. ఆ భారాన్ని మొత్తం అబ్కారీ శాఖనే భరించాలి.

Related posts