telugu navyamedia
రాజకీయ

భారీ హామీల‌తో యూపీ ఎన్నిక‌ల‌ బీజేపీ మేనిఫెస్టో విడుదల..

* రైతులకు ఉచితంగా విద్యుత్..

*మహిళలకు ఉచిత రవాణా సదుపాయం

*షుగర్‌ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు రూ.5వేల కోట్లు

* గోధుమలు, వరికి కనీన మద్దతు ధర

* ఐదు వేల కోట్లతో వ్యవసాయ సాగునీటి పథకం

* రూ.25,000 కోట్ల వ్యయంతో సర్దార్ పటేల్ అగ్రి-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్

* 60 లక్షల మందికి రుణ కేటగిరీ

* బంగాళదుంప, టమోటా, ఉల్లి వంటి అన్ని పంటలకు కనీస ధర కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయింపు

* చెరుకు రైతులకు 14 రోజుల్లోగా చెల్లింపు, ఆలస్యమైతే వడ్డీతో సహా నిషాద్రాజ్ బోట్ సబ్సిడీ పథకం

* ఉజ్వల యోజన కింద వినియోగదారులకు ఏడాదిలో 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తాం.

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ లో మ‌రో రెండు రోజుల్లో మొద‌టి ద‌శ ఎన్నిక‌లు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీ నేత‌లు స్పీడ్ పెంచారు. అందులో భాగంగానే భారీ హామీలతో అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. ‘లోక్‌ కల్యాణ్ సంకల్ప పత్రం’ పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో రైతులు సంక్షేమం, మ‌హిళ‌లు, నిరుద్యోగులకు వరాలజల్లు కురిపించింది. ప్రధానంగా మేనిఫెస్టోలో జాతీయవాదం, అభివృద్ధి, సుపరిపాలన అంశాలను పేర్కొన్నారు.

మంగళవారం లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 25కోట్ల మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ఐదేళ్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చామని అమిత్ షా తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంలో ప్రతి రైతు, పేదలు, మహిళలు ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చేలా పనిచేస్తున్నామన్నారు.

రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి బీజేపీ హామీ ఇచ్చింది. కన్యా సుమంగళ యోజన పథకం కింద అందించే ఆర్థిక సాయాన్ని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచుతామని చెప్పింది. హిందూ అమ్మాయిల జోలికి ముస్లిం యువకులు రాకుండా యూపీలో లవ్ జిహాద్ చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేస్తామని కమలదళం పేర్కొంది.

BJP's manifesto for UP includes punishments and fines against 'love jihad'

ఉత్తరప్రదేశ్ రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించింది బీజేపీ. యూపీలో నీటిపారుదల కోసం ఉచిత కరెంటు అందిస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. విస్తారంగా పండే చెరుకు పంట విషయంలోనూ కీలక ప్రకటన చేసింది. 15 రోజుల్లోనే చెరుకు పంట బకాయిలు చెల్లిస్తామని చెప్పింది. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలు, విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా రైతులు ఏడాదిపాటు నిరసనోద్యం చేసిన దరిమిలా ఈసారి మేనిఫెస్టోలో సాగు సంబంధిత అంశాలకు పెద్ద పీట వేశారు.

ఇది కేవలం ఎన్నికల మేనిఫెస్టో కాదని, యూపీలోని 24 కోట్ల జనాభాకు లోక కళ్యాణ సంకల్ప్ పత్రమని సీఎం యోగి అన్నారు.బీజేసీ సర్కార్ తీసుకున్న కఠిన నిర్ణయాలతో రాష్ట్రంలోని ప్రతి కూతురు, ప్రతి తల్లి సురక్షితంగా ఉంటున్నారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తెలిపారు.25 కోట్ల మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి బీజేపీ మేనిఫెస్టోను రూపొందించినట్లు సీఎం యోగి అన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు 7 విడతల్లో జరగనున్నాయి. మొదటి విడత ఎన్నికలు ఫిబ్రవరి 10న జరగనుంది. మార్చి 10న ఫలితాలు ప్రకటించనున్నారు.

Related posts