telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రోల్ రైడా ‘నాగలి’ ర్యాప్ సాంగ్ ‌కు నెటిజన్లు ఫిదా

Roll

ర్యాప్ సింగర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ రోల్ రైడా తాజాగా ‘నాగలి’ అనే ర్యాప్ మ్యూజిక్ వీడియో చేశాడు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ వీడియో రైతులపై ప్రేమను, గౌరవాన్ని ప్రతిబింబించింది. అమిత్ రైతు జీవితంలో భావోద్వేగాలను అద్భుతంగా పలికించాడు. రోల్ చేసిన ప్రవేట్ వీడియో సాంగ్స్‌లో ఈ వీడియో సాంగ్ ప్రత్యేకంగా నిలుస్తుంది. అమిత్ తివారీ నటించిన ఈ మ్యూజిక్ వీడియో ఆగస్ట్ 14న విడుదలైంది. ఈ వీడియో టీజర్ ఆగస్టు 1న రోల్ రైడా అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. ‘ఏడ నుంచి వచ్చావు రైతన్నో, ఎడకెల్లి పోయావు రైతన్న..’ అని సాగే ఈ పాట టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. రాహు చిత్రంలో ‘ఏమో ఏమో ఏమో’ అంటూ సూపర్ హిట్ సాంగ్ కంపోజ్ చేసిన ప్రవీణ్ లక్కరాజు ‘నాగలి’ ర్యాప్ మ్యూజిక్ వీడియోకు సంగీతాన్ని అందించారు.

Related posts