telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

న్యాయశాస్త్రంలో .. లొసుగులు దోషులకు బాగా ఉపయుక్తంగా ఎందుకు ఉన్నాయి.. నిర్భయ తల్లి..

nirbhaya mother on indian law

పటియాలా కోర్టు తీర్పు ఇవ్వడంపై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణంలోనే ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌.. ఆ నలుగురికి ఎన్నడూ ఉరిశిక్ష అమలు కానివ్వని తనను సవాలు చేశాడని తెలిపారు.న్యాయవ్యవస్థలోని లొసుగులను దోషులు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్ల నుంచి తాము న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నామని, న్యాయం కోసం ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలని ఆశాదేవి మండిపడ్డారు. ట్రయల్ కోర్టు,సుప్రీంకోర్టు అంటూ తాము ఇంకా న్యాయం కోసం కోర్టులు చుట్టూ తిరుగుతూనే ఉన్నామని, తాను ఎంత పోరాటం చేసినా న్యాయవ్యవస్థలో మార్పులు లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నిందితుల క్షమాబిక్ష పిటిషన్లు త్వరగా తిరస్కరించాలని తాను రాష్ట్రపతిని కోరుతున్నానన్నారు. నలుగురు దోషులు ఉరిశిక్షపై విధించిన స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తాను పిటిషన్ వేయబోతున్నట్లు ఆమె తెలిపారు. దోషులను ఉరి తీసేంత వరకు పోరాటం ఆపబోనని ఆమె సృష్టం చేశారు. మరోవైపు సారీ ఇండియా,సారీ నిర్భయ హ్యాష్ టాగ్ లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్,హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిలు కూడా ఇవాళ పటియాలా తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Related posts