telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భయాన్ని అధిగమించాలంటే రెండే దారులు : పూరి

Puri

సమాజంలో ప్రజలకు ఎదురవుతోన్న, అనుభవిస్తోన్న పలు ముఖ్యమైన అంశాలపై ఇప్పటికే పోడ్‌కాస్ట్‌లు వదిలిన పూరి… తాజాగా ‘పూరీ మ్యూజింగ్స్’ అంటూ తన వాయిస్ ఓవర్‌తో ఆడియోలను విడుదల చేస్తున్నారు. తన సినిమాల్లో పదునైన, ఆలోచనాత్మక సంభాషణలతో ప్రేక్షకులను అలరించే పూరీ ప్రస్తుతం వివిధ అంశాలపై తన ఆలోచనలను ‘పూరీ మ్యూజింగ్స్’ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఏదో ఒక టాపిక్ తీసుకుని దానిపై తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నో అంశాల గురించి మాట్లాడిన పూరీ తాజాగా భయం గురించి మాట్లాడారు. “పుట్టినప్పుడు అమాయకంగానే పుట్టాం. భయం అంటే ఏంటో తెలీదు. ఆ తర్వాత సమాజం మనలో వంద భయాలు సృష్టించింది. ప్రతి మతం మనలో భయాన్ని పెంచింది. ధైర్యాన్ని నూరిపోసిన మతం ఒక్కటీ లేదు. దేవుడిని చూసి భయపడడం నేర్పారు తప్ప.. ప్రేమించడం నేర్పలేదు. ప్రతిదానికి భయపడేలా చేశారు. పుట్టగానే గట్టిగా ఏడుస్తాం. ఆ మొదటి ఏడుపుతోనే మనం గట్టిగా ఊపిరి తీసుకోవడం ప్రారంభిస్తాం. ఏదో ఒకరోజు ఊపిరి వదిలేస్తాం.. చనిపోతాం. అంటే ఊపిరి పీలిస్తే `బతుకు`.. ఊపిరి వదలడం `చావు`. ఊపిరి వదిలే ప్రతిసారి మనం చావును ముద్దుపెట్టుకుని వస్తున్నాం. మనకున్న భయాల్లో అతి పెద్దది చావు. దాన్నే మనం రోజుకి వేల సార్లు ముద్దు పెట్టుకుని వస్తున్నాం. దానితో పోల్చుకుంటే మిగిలిన భయాలు చాలా చిన్నవి. మనలో ఉన్న భయాన్ని అధిగమించాలంటే రెండే దారులు ఉన్నాయి. మొదటిది.. హాస్య చతురతను పెంచుకోవడం. మీలో కలిగే ప్రతి భయాన్ని కామెడీ యాంగిల్‌లో చూడండి. ఇక, రెండోది వ్యాయామం. మీ మజిల్స్ విజిల్స్ వేస్తే.. మీ నరాలు ధైర్యంతో నిండిపోతాయి. ఏ భయమూ మిమ్మల్ని ఏమీ చేయలేదు” అంటూ చెప్పుకొచ్చారు పూరీ.

 

View this post on Instagram

 

‪👉 https://youtu.be/0XkOq2ODQtc @charmmekaur #PC

A post shared by Puri Connects (@puriconnects) on

Related posts