telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఒక్క సినిమా విడుదల కాకముందే మూడు సినిమాలు పట్టేసిన హీరోయిన్…

అతి తక్కువ సమయంలోనే కొందరు హీరోయిన్‌గా వచ్చి వెళ్ళిపోతారు. కొందరు ఎంత ప్రయత్నించినా చాన్స్‌లు దొరకవు. మరి కొందరు మొదటి సినిమాతోనే ఆగిపోతారు. కానీ ఒక్క సినిమా కూడా విడుదల కాకుండా మంచి హీరోయిన్ అనే పేరు తెచ్చుకోవడం సినీ చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదు. కానీ కృతి షెట్టి చరిత్రలో తనకంటూ ఓ పేజీని రాసుకుంది. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే మంచి హీరోయిన్‌గా పేరుతో పాటు మరో మూడు సినిమాల ఆఫర్లు అందుకుంది. ఈ మూడు సినిమాలు ఇంకా చర్చల దశలో ఉన్నాయి. అయితే కృతి నటించిన ఉప్పెన సినిమా ఇప్పటి వరకు విడుదల అవ్వలేదు. ఈ ఏడాదిలో విడుదల అవ్వాల్సిన సినిమా కాస్తా కరోనా అంటూ వాయిదా పడింది. ఈ సంవత్సరం ఎందరికో విషాదాన్ని అందించినా, ఉప్పెనా హీరోయిన్‌కు మాత్రం సరికొత్త రికార్డును అందించింది. దానికి తోడుగా తమిళం నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయని సమాచారం. అగ్ర హీరో సూర్యా కథానాయకుడిగి హరి దర్వకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈ ముద్దుగుమ్మ ఇంకా ఎంత ఎత్తుకు ఎదుగుతుంది అనేది.

Related posts